Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముదిగుబ్బలో భూముల సమస్యలను వెంటనే పరిష్కరించండి..

ముదిగుబ్బలో భూముల సమస్యలను వెంటనే పరిష్కరించండి..

- Advertisement -

ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;: నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో దీర్ఘకాలికంగా నెలకొన్న చుక్కల భూముల సమస్యలతో పాటు ఫ్రీ ఓల్డ్ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పరిష్కరించి మండల రైతులు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు ఆఫీస్ నుంచి ర్యాలీ చేపట్టి, అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, అనంతరం రెవెన్యూ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి తాసిల్దార్ మునుస్వామికి అందజేశారు. ఈ మేరకు సిపిఐ నాయకులు ఎమ్మార్వో కార్యాలయానికి కాసేపు
తాళం వేసి కూడా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ 1954 ముందున్న పాత పట్టా భూములు చాలావరకు 2018 నుంచి 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చబడి,చుక్కల భూములుగా నమోదు చేయబడి, అవి నేటికీ రిజిస్ట్రేషన్ కు నోచుకోకుండా పోయాయి అన్నారు. అదేవిధంగా గత వైసిపి ప్రభుత్వం లో 20 ఏళ్ల సీనియార్టీ కలిగిన అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి అవి కూడా రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా మాజీ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేసి ,సుమారు 13 లక్షల 59 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడం జరిగిందని సిపిఐ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో 2018లో తన వల్ల ఏర్పడిన చుక్కల భూముల సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం చర్యలు తీసుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోరుచుట్టుపై రోకటి పోటులా
ఈ ఫ్రీ ఓల్డ్ భూములపై కూడా నిషేధం విధించి అవి కూడా రిజిస్ట్రేషన్ కాకుండా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఓవైపు చుక్కల భూముల సమస్యతో పాత పట్టా భూములను అమ్ముకోలేక మరోవైపు నిషేధంతో ఫ్రీ ఓల్డ్ అయిన అసైన్డ్ భూములను అమ్ముకోలేక చివరికి తనకా పెట్టి కూడా అప్పు తీసుకోలేక తదితర ఇబ్బందులతో మండల రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. ఇదే అదునుగా భావించి మండల రెవెన్యూ అధికారులు సిబ్బంది ఎన్ఓసీల పేరుతో ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే గాక సంవత్సరాలతరబడి మభ్యపెడుతు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని వారు మండిపడ్డారు. కనుక ఇప్పటికైనా తక్షణమే 1954 ముందు పట్టాలు పొందిన భూములను ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించడమే గాక
ఫ్రీ హోల్డ్ భూములపై కూడా నిషేధం ఎత్తివేసి తద్వారా ఆయా భూములు రిజిస్ట్రేషన్ అయ్యేవిధంగా చర్యలు తీసుకొని మండల రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో త్వరలోనే మండల రైతులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడితోపాటు
చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శులు తిప్పయ్య, ఈశ్వర నాయక్, లతోపాటు రమేష్ నాయుడు, వెంకట్రాముడు, కుర్ర నాయుడు, లింగుట్ల రామకృష్ణ,వెంకటేశ్వర నాయక్, శంకర, ఎం మధు, వెంకటేష్ కొండయ్య, మంగలి శీన, చాంప్లా నాయక్, సన్నాభాయ్, సరస్వతి భాయ్, తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు