హిడ్మాను ఎంకౌంటర్ చేయటం – కసబ్ ను ఉరి తీయటంలో రాజకీయ ఆంతర్యం ఏమిటి
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఆపరేషన్ సిందూర్ వంటి భారతదేశ భద్రతా దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని ఆపేసారని, మరి ఆపరేషన్ కగార్ ను ఎందుకు ఆపటం లేదని, ఎందుకు శాంతి చర్చలు జరుపటం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ సామాన్య పౌరులను చంపుతున్న తీవ్రవాదులతో చర్చలు జరపడానికి ఆసక్తి చూపిస్తున్నారని, . సమ న్యాయం అమలు చేయమని పోరాడుతున్న నక్షలైట్ లను చంపి వేయటంలో మర్మం ఏమిటో సగటు భారతీయులకు అర్ధం కావటం లేదన్నారు. నక్షలైట్ ఉద్యమం స్వదేశీ , విదేశీ , దోపిడీ పాలనకు , బానిసత్వానికి వ్యతిరేకంగా పురుడు పోసుకుందని, ఉగ్రవాదం విదేశీ మత ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తుందని, మన పాలకులు మాత్రం ఉగ్రవాద పాకిస్తాన్ తో శాంతి చర్చలు అంటాదని, . నక్షలైట్ లను తుపాకీతో కాల్చి చంపేస్తుంటారని విమర్శించారు. నక్షలైట్ హిడ్మా భారత జాతీయ జెండాను గౌరవిస్తునే సాయుధ పోరాటంలో అమరులయ్యాదని, ఓవైసీ పాకిస్తాన్ ఇస్లాం కు జై అంటూనే భారత జాతీయ గీతాన్ని అగౌరవ పరుస్తూ భారత పార్లమెంట్ లో కీర్తింప బడుతున్నారన్నారు. ముంబై తాజ్ హోటల్ లో మారణ కాండ సృష్టించిన కసబ్ ను చట్ట బద్దంగా విచారించి ఉరి తీసారని, భారతదేశ విమానాన్ని కాందహర్ విమానాశ్రయం వేదికగా హైజాక్ చేసిన మసూద్ అజార్ తో సహ కొంతమంది ముష్కరులను వారు కోరిన విధంగా అత్యంత గౌరవంగా పాకిస్తాన్ పంపించారన్నారు.
కగార్ వంటి ఆపరేషన్స్ లేకుండా నక్షలైట్ లను చట్ట బద్దంగా నిర్భందించగల వ్యూహం . సామర్ధ్యం మన ప్రభుత్వాలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఎంకౌంటర్స్ వల్ల సాయుధ పోరాటాన్ని ఆప గలుగుతున్నారా లేదా అనే అంశాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. హిడ్మా , తదితరులను చంపి సాయుధ పోరాటంలో మెరుగైన మార్పులు సాధించ గలిగారా లేదా మరిన్ని అలజడులకు కారకులవుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. స్వదేశీ ఉద్యమకారులను ఎంకౌంటర్స్ చేయటం . విదేశీ ఉగ్రవాదులను చట్టభద్ధంగా శిక్షించటంలో జరుగుతున్న ప్రభుత్వ వైఖరిని పలువురు ప్రశ్నిస్తున్నారన్నారు. భారత ప్రజాస్వామ్యం ఎటు పోతుందని, విప్లవాన్ని ఎంకౌంటర్ చేయటం . ఉగ్రవాదాన్ని చట్ట బద్దంగా శిక్షించటంలో అర్ధం ఏమిటని ఆ ప్రకటనలో మేడా ప్రశ్నించారు


