Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 198 బాలురకు స్టడీ మెటీరియల్స్ ను ఆంధ్రప్రదేశ్ బెస్త కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ బెస్ట్ శ్రీనివాసులు బెస్త సేవా ట్రస్ట్ అధ్యక్షులు దత్త శివ చేతులమీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు నేడు ఎంతో అవసరమని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి చదివితే ప్రతిదీ విజయవంతమవుతుందని తెలిపారు. ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గరగా ఉన్నందున టీవీలకు, ఆటలకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువు మీదే ధ్యాస ఉంచాలనే తెలిపారు. ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతిదీ అమలు చేసేలా క్షుణ్ణంగా చదవాలని అప్పుడే పరీక్షా ఫలితాలు మెరుగుపడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా పదవ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణత చెందేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మేరీ వర కుమారి, జి ఆర్ రామ్మోహన్, ఓబుళపతి, వెంకటపతి, సదాశివ, విజయభాస్కర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు