ఎంఈఓలు గోపాల్ నాయక్. రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వస్తువులో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని ఎం ఈ ఓ.1 రాజేశ్వరి దేవి, ఎంఈఓ.2గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మండలంలోని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు స్థానిక ఎమ్మార్సీలో వినియోగదారుల హక్కుల గురించి వివరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 24న వినియోగదారుల దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రతి వినియోగదారుడు తాము కొనుగోలు చేసిన వాటిపై నాణ్యత ఉండాలి సరి అయిన తూకం కూడా ఉండాలని తెలిపారు. ఎమ్మార్పీ ధరలకే అమ్మే విధంగా వస్తువులు ఉండాలని తెలిపారు. అదే కాకుండా వస్తువులు కొరుగోలు విషయంలో ప్రశ్నించే తత్వము కూడా ఉండాలని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం తీసుకొని రావాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఇందులో గెలిపించిన విద్యార్థులు జిల్లా సాయికి పంపడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి వస్తువులో నాణ్యత తప్పనిసరి ఉండాలి..
- Advertisement -
RELATED ARTICLES


