- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు నర్సిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామ శివారుల్లోని పొలాల్లో ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే మంచి వేతనం పొందవచ్చునని తెలిపారు. వలసలు వద్దు – ఉపాధి పనులు ముద్దు అని ఎవరూ కూడా వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూలీలు పాల్గొన్నారు.


