Homeజిల్లాలుకర్నూలుఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు

ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక నారాయణ ప్రైమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ దీప్తి, హెడ్‌మాస్టర్ ఖలీద్ లు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, త్యాగం, మానవత్వానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు మంచి విలువలు, క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ఈశ్వరప్ప, నీలకంఠతో పాటు ఉపాధ్యాయులు లావణ్య, అంజినమ్మ, త్రివేణి, పవిత్ర, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు