Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా క్రిస్మస్ వేడుకలు.. కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల

ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పాఠశాల కరిష్పాండెంట్ నిర్మలాదేవి క్రిస్మస్ పండుగ విశిష్టత గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. ఏసుక్రీస్తు పుట్టుక వాటి తరువాత జరిగిన పరిణామాలను వారు చక్కగా వివరించారు. అనంతరం క్రిస్మస్ ట్రీ అలంకరణ శాంత క్లాజ్ వేషధారణ అందరిని అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు క్రిస్మస్ పండుగకు సంబంధించిన పాటలు, నృత్యాలు నిర్వహించారు. క్రైస్తవులందరూ ఈ క్రిస్మస్ పండుగను అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శెట్టి సూర్య ప్రకాష్ రెడ్డి,కరెస్పాండెంట్ నిర్మలాదేవి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు