క్యాంప్ చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 118 వ ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతినెల నాల్గవ ఆదివారం ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈ శిబిరానికి చిన్న పిల్లలు, వృద్ధులు, పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యం పొందాలని తెలిపారు. ప్రముఖ డాక్టర్లు వివేక్ కుళ్లాయప్ప, విట్టల్ -దంత వైద్యులు, డాక్టర్ వెంకటేశ్వర్లు- చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ జైదీపు నేత-గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్హ – హైదరాబాద్, డాక్టర్ సతీష్ కుమార్ – ఎముకల వైద్యనిపుణులు, జస్ట్ నీ పనులు డాక్టర్ ప్రణయ్, డాక్టర్ వినయ్ పాల్గొని రోగులకు వైద్య పరీక్షలను అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరుగుతుందన్నారు. ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. రోగులు ఇంతకు మునుపు వాడుతున్న మందుల వివరాలు వెంట తీసుకొని రావాలని తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించబడును అని తెలిపారు.ఈ శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు బద్దెల బాలమ్మ ,కీర్తిశేషులు బద్దెల వెంకటరామయ్య, కీర్తిశేషులు బద్దల వరలక్ష్మి, కీర్తిశేషులు బద్దెల వెంకట రత్నయ్య జ్ఞాపకార్థం వీరి కుమారులు బి.వి శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ వ్యవహరిస్తా రని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ,పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు.
118వ ఉచిత వైద్య చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


