శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, గణపతి సచ్చిదానంద దత్త జ్ఞానబోధ ట్రస్టు, ఆలయ అభివృద్ధి కమిటీ, అర్చకులు సుదర్శనాచార్యులు ఎస్ జి ఎస్ వాలంటీర్లు, మాతృమండలి వారు తెలిపారు. అనంతరం కార్యవర్గ సభ్యులు మెటికలకుల్లాయప్ప, శంకర్ సంజీవులు, శాగా సురేష్ ,గుద్దిటి రామాంజనేయులు ,దత్త శివ తదితరులు మాట్లాడుతూ ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భక్తాదులు, దాతలు కూడా ముందుకు రావడం జరిగిందని, ప్రత్యేక పూజలు అభిషేకాలు, ప్రత్యేక దర్శనము ఉంటుందని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు.
వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు విజయవంతం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


