Homeజిల్లాలుకర్నూలుఎస్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ

ఎస్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఎమ్మార్సీ భవనం నందు శనివారం రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) 2026 సంవత్సరపు నూతన క్యాలండర్ ను మండల విద్యాశాఖ అధికారులు ఉస్మాన్ భాష, రామ్మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర పూర్వపు ఉపాధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పొరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు. పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని, పెండింగు బకాయిలను చెల్లించాలని, బోధనేతర పనులు తగ్గించి ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. సర్వీసుల ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులను పూలమాలలు వేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, ఈరేశ్ రాజు ఎస్ టి యు నాయకులు ప్రభాకర్, రంజాన్, దామోదర్, గరగయ్య, బీరప్ప, తిరుమలేష్, ఈరన్న, నారాయణరావు, రామాంజనేయులు, వీరేష్, రాజశేఖర్, మహేష్, దినేష్, లక్ష్మయ్య, విజయ్ కుమార్ గౌడ్, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు