Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదానమే దైవ సేవతో సమానం..

అన్నదానమే దైవ సేవతో సమానం..

- Advertisement -

రజని, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానమే దైవ సేవతో సమానమని రజని, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షుడు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు మందికి దాతల సహకారంతో అల్పాహారమును పంపిణీ చేశారు. దాతగా విష్ణు ప్రియ, సుప్రీత పేరు మీద వారి తల్లిదండ్రులు రాఘవేంద్ర, అమల వ్యవహరించడం జరిగిందని, అనంతరం వారికి ట్రస్టు తరుపున కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్రనాయక్ మాట్లాడుతూ రజిని ట్రస్ట్ రక్త బంధం ట్రస్ట్ రక్త దానములోనూ, వివిధ సేవా కార్యక్రమాలలోనూ ముందంజలో ఉండడం గర్వించదగ్గ విషయమని తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకుడు, కౌన్సిలర్ కేత లోకేష్, చంద్రశేఖర్ రెడ్డి, ఉదయ్ కుమార్, హరికృష్ణ, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు