Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపారిశుద్ధ్య కార్మికుడు గుండెపోటుతో మృతి

పారిశుద్ధ్య కార్మికుడు గుండెపోటుతో మృతి

- Advertisement -

నివాళులు అర్పించిన సిపిఎం నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 37వ వార్డులో మారుతీ నగర్ కు చెందిన సాకే లక్ష్మీనారాయణ (45) ఆర్టీసీ బస్టాండ్ వద్ద పనిచేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి, గుండెపోటుతో మృతి చెందాడు. గమనించిన స్థానికులు కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పుల్లన్న, సిపిఎం నాయకులు అయూబ్ ఖాన్ తదితరులు మృతదేహానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ మృతి చెందడం తీరని లోటు అని, ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకుంటూ తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని వారు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుడు మృతి పట్ల శానిటరీ విభాగం అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు