Wednesday, February 18, 2026
Homeజిల్లాలునెల్లూరు"ఒత్తిడి లేని పరీక్షల కోసమే పరీక్ష పే చర్చ" డైట్ అబ్జర్వర్

“ఒత్తిడి లేని పరీక్షల కోసమే పరీక్ష పే చర్చ” డైట్ అబ్జర్వర్

- Advertisement -

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని శాఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జిల్లా విద్య శిక్షణ సంస్థ పరిశీలకులు సంగా మహేంద్ర విజిట్ చేసి పునాది అభ్యసనం, సామర్ధ్యాలు మరియు పదవ తరగతి కి సంబంధించి వంద రోజుల విద్యా ప్రణాళిక మీద ఉపాధ్యాయులతో చర్చ చేయడం జరిగింది. పదవ తరగతి లో 100% ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు అలాగే పరీక్ష పే చర్చను అందరూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసి పరీక్ష పే చర్చలో పాల్గొనాలని, విద్యార్థులలో అవగాహన కల్పించి అత్యున్నత నమోదు శాతాన్ని కలిగించాలని తెలిపారు, ఒత్తిడి లేని పరీక్షల ను ఎదుర్కోవడమే పరీక్ష పే చర్చ ముఖ్య ఉద్దేశమని 2018 వ సంవత్సరం నుండి మోడీ గారి నాయకత్వంలో చర్చ జరుగుతుందని నేటి యువత పరీక్షలకు ఒత్తిడి లేని వాతావరణంలో సిద్ధం కావడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, పెంపొందించడమే పరీక్షాపే చర్చ ఉద్దేశమని, తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి కేశవరావు ,చల్లా బ్రహ్మయ్య పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు