విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ లో పీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టును బోధించుటకు ఆసక్తిగల ఎం ఏ ( ఇంగ్లీష్)బిఇడి అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలతో జనవరి 6వ తేది (మంగళవారం ) ఉదయం 10 గంటలకు ఏపి మోడల్ స్కూల్ చుండి వద్ద ఇంటర్వ్యూ మరియు డెమో కి హాజరుకావాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పడమటి శ్రీ వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెలకు 12,000రూపాయలు జీతంతో తాత్కాలిక ప్రాతిపదిక మీద ఈ నియామకం ఐదు నెలల పాటు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర్ తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. 7032996518,9440929729. ఇతర వివరాలకు చుండి మోడల్ స్కూల్ లో సంప్రదించాలని అన్నారు.


