ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య.
విశాలాంధ్ర ధర్మవరం;; అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇతనికి లో భాగంగా అన్ని రికార్డులను వారు పరిశీలించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసి విక్రయించాలని తెలిపారు. అదేవిధంగా బెల్ట్ షాపులపై తరచూ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వా అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం నాటు సారా అలాంటివి విక్రయించే రాదన్నారు. నేరమును చేసే వ్యక్తులను పాత నేరస్తులను బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి మద్యం షాపులో ఎంఆర్పి రేట్లను అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీరామ్, ఎక్సైజ్ చంద్రమణి, ఎస్సైలు చాంద్‌బాషా, నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు
- Advertisement -
RELATED ARTICLES


