Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభవిత కేంద్రంలో స్టీఫెన్ హాకింగ్ జన్మదిన వేడుకలు

భవిత కేంద్రంలో స్టీఫెన్ హాకింగ్ జన్మదిన వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – హిందూపురం : పట్టణంలో భవిత కేంద్రంలో కరాటే మాస్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో గురువారం స్టీఫెన్ హాకింగ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, విజ్ఞాన శాస్త్రానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ అని, ఆయన మోటార్ న్యూరో సంబంధించిన లోపంతో బాధపడుతున్న ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారని, స్టీఫెన్ హాకింగ్ యొక్క జీవిత చరిత్రను పిల్లలకు ఆదర్శమని, దివ్యాంగులను చూసుకోవడం తల్లిదండ్రుల యొక్క మొదటి బాధ్యత అని, వారి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం స్టీఫెన్ హాకింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు , భవితా సెంటర్లోని దివ్యాంగ చిన్నారులకు విద్యాకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠశాల హెచ్.ఎం. సూర్యనారాయణ, కరాటీ మాస్టర్ రామచంద్ర, ఐఆర్పిలు లలిత, నందిని, పిటిఐ రఘు, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు