Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి

- Advertisement -

విశాలాంధ్ర కొత్తచెరువు.. నల్లమడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (33) అనే యువకుడు గుండెపోటు మృతి చెందాడు. కొత్త చెరువులో బస్టాప్ నందు బస్సు ఎక్కడానికి వేగంగా వెళుతుండగా ఒక్కసారి గుండెపోటు రావడంతో కిందపడి మృతి చెందాడు . మృతి చెందిన పురుషోత్తం స్వగ్రామంలో దేవాలయంలో పగలు పూజలు నిర్వహించి రాత్రి వేళలో పుట్టపర్తి లోని ఎస్బిఐ బ్యాంకు వద్ద ప్రైవేట్ వాచ్మెన్ గా ఆ విధులు నిర్వహించేవారు. ప్రతిరోజు లాగే విధులను ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈయన మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వచ్చి మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు