విశాలాంధ్ర ధర్మవరం;;సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అని డి.ఎస్.పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా కోడిపందాలు, టెంకాయ ఆటలు తదితర జూదాలు నిర్వహించిన పాల్గొన్న ప్రోత్సహించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తూ, రాబోవు సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలకు కోడి పందాలు, టెంకాయ ఆట వంటి జూదల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కోడి పందాలు టెంకాయ ఆటలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు… డి.ఎస్.పి హేమంత్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES


