Homeజిల్లాలుఅనంతపురంజీవిత పాఠాలు నేర్పేది గురువులు..

జీవిత పాఠాలు నేర్పేది గురువులు..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జీవన రంగంలో ఎదురవుతున్న ఎన్నో రుగ్మతులను తొలగిస్తూ.. సమాజ అభ్యున్నతకు తోడ్పాటునందించేది గురువులే అని శ్రీ బాలాజీ విద్యా సంస్థల అధినేత పల్లె కిషోర్ పేర్కొన్నారు. శ్రీ బాలాజీ బీఈడీ కళాశాలలో 2007 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో చదివిన పాఠ్యాంశాలు, గురువులు నేర్పిన బాట, స్నేహితుల ప్రేమ, ఐక్యత స్ఫూర్తిని ఎన్నటికీ మరువలేమన్నారు. పూర్వ పూర్వ విద్యార్థులతో సమ్మేళన కార్యక్రమం చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లె ఉమా మేడం.. విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం తోడ్పాటును అందించేదని భావోద్వేగానికి గురయ్యారు. క్రమశిక్షణతో విలువలు అందించే కళాశాల శ్రీ బాలాజీ బీ ఈ డీ కళాశాల అని అన్నారు. పోటీ ఎంత ఉన్నా.. లక్ష్యం వైపు అడుగులు గమ్యాన్ని చేరువు చేస్తే అన్నారు. అనంతరం విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు