విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని క్రీడా మైదానంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను కలెక్టర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, టిడిపి నాయకులు పరిసే సుధాకర్, కమతం కాటమయ్య, ఫణికుమార్, జనసేన నాయకుడు రాజారెడ్డి, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. సంక్రాంతి సంబరాల క్రీడలతో సాంప్రదాయ వేడుకలను లో భాగంగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఇందులో తాడు దూకుట, తోపుడు బిల్లా, కర్ర సాము, ఏడు పెంకుల ఆట, తాడు లాగుట, గాలిపటాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా జరగడం శుభదాయకమని, అందులో మన ధర్మవరంలో సాంప్రదాయ పద్ధతిలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. అనంతరం ప్రతిభ ఘనపరిచిన వారందరికీ బహుమతులను, శుభాకాంక్షలు నువ్వు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా సంక్రాంతి వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


