విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరెస్పాండెంట్ మల్లికార్జున హాజరై, పలు విషయాలను మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది రైతులందరూ ఆనందంతో ఆనందంగా జరుపుకుంటారని, భోగి మంటలు అనేవి మనలో ఉన్న అహంకారాన్ని వదిలి సూర్యుడిలా వెలుగును ప్రసాదించాలని వారు తెలిపారు. అకాడమీ డైరెక్టర్ పృధ్విరాజ్ పిల్లలందరికీ భోగి పండ్లు వేసి అందరినీ ఆశీర్వదించారు. పాఠశాల హెడ్మాస్టర్ అనూప్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది రైతులు ముఖ్యంగా మూడవ రోజున తమ పశువులకు, భూమికి కృతజ్ఞతగా వాటిని పూజించే రోజు అని తెలిపారు. ఇన్చార్జ్ హెడ్మాస్టర్ ఝాన్సీ మాట్లాడుతూ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు పల్లెటూరి వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం పండుగ ప్రాముఖ్యతను తెలిపారు. తదుపరి విద్యార్థులు అందరూ కూడా లక్ష్మీదేవి పూజను పూజించడం విద్యార్థుల ప్రసంగాలు నాటకాలు భోగిమంటలు ఎద్దుల బండ్లు, విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
- Advertisement -
RELATED ARTICLES


