విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : ఈనెల 18న ఖమ్మంలో జరుగు సీపీఐ శతాభ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు పిలుపునిచ్చారు.. సోమవారం సీఆర్ భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ రామంచంద్రయ్య, ఆవుల శేఖర్, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్యలతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహి ంచారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన ఏకైకపార్టీ సీపీఐ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఏమాత్రం పాత్రలేని బ్రిటీష్ వారి అడుగులకు మడుగులు వత్తిన వారు నేడు పాలిస్తున్నారని విమర్శించారు. తెలంగాణా సాయుధపోరాటంతోపాటు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా దున్నెవాడిదే భూమి అన్న నినాదంతో , వెట్టిచాకిరికి వ్యతిరేఖంగా దోపిడికి , పెత్తందారి విధానంకు వ్యతిరేఖంగా పోరాటం చేయడమే కాకుండా లక్షలాది ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఘనత సీపీఐది అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చకొడుతూ రాజ్యాంగాన్ని మార్చె ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని తనకు అనుకూలంగా మలుచుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల కమీషన్ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందని ఆరోపించారు.తాము అధికారంలోకి రావడానికి లక్షలాది ఓట్లు తొలగిస్తుందని ఆరోపించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దుచేసి కొత్తచట్టం తీసుకువాలని ప్రయత్నందుర్మార్గమన్నారు. వెంటనే ఆలోచన విరమించుకోవాలని ఆచట్టంను అదేవిధంగా అమలు చేయాలని కోరారు.రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాదాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అమరావతి పోలవరం తప్ప మరి ఏది పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఈనెల 18న ఖమ్మంలో జరుగు సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలకు సుమారు 40దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారనని , లక్షలాది మంది ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ స్పూర్తితో రాబోయో రోజుల్లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా సీపీఐ చేసే పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునెప్ప, ఎన్ లెనిన్‌బాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె జగన్నాధం, రామకృష్ణారెడ్డి, కారుమంచి , రంగన్న, వీరూపాక్షి, శ్రీనివాసులు, శ్రావణి, ,రాజు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి సీ మహేష్ తదితరులు పాల్గొన్నారు
ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి : సీపీఐ
ఆదోని కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ తీర్మాణం చేసింది. సోమవారం సీఆర్ భవన్లో సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యులు కె జగన్నాధం అద్యక్షతన జిల్లా కార్యవర్గం నిర్వహించారు.ఈ కార్యవర్గ సమావేశంలో ఆదోని కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ,పత్తికొండ నియోజకవర్గంలోని క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని సభ్యులు చర్చించి తీర్మాణం చేశారు..
18న ఖమ్మంలో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


