Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది

ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది

- Advertisement -

యుటిఎఫ్ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లాలో 441 మంది ఊపాధ్యాయులకు సాంకేతిక లోపాల మధ్య 07/01/26 న ఫేషియల్ అటెండెన్స్ సాయంత్రం పూట వేయలేదని నోటీసులు/ సంజాయిసి కోరడం అత్యంత బాధాకరం అని తెలుపుతూ యుటిఎఫ్ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టి బిజెపి చంద్రారెడ్డి , జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ యాప్‌లు, అటెండెన్స్ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు అని ముందు వాటిని సవరించాలి అని ఉపాధ్యాయులను కాదు అని తెలిపారు. పనిచేస్తున్న ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని తెలిపారు.
ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను భయపెట్టే చర్యలు తక్షణమే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు.షోకాజ్ నోటీసులు/ సంజాయిషీ వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.ఇప్పటికే బోధనేతర కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయ లోకమును తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్న అధికారులు నియంతృత్వ ధోరణిలో వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నోటీసులు ఉపసంహరించుకోవాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు భూతన్న, ఉపాధ్యక్షులు బాబు ఉపాధ్యక్షురాలు గౌరమ్మ కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శిలు నరసింహప్ప, జిసి నరేష్ కుమార్, అమర్, నారాయణరెడ్డి, మల్లికార్జున ,రవి వర్ధన్ రెడ్డి, మురళి,నాగేంద్రమ్మ, చెన్నకేశవులు , బాబు, రాష్ట్ర కౌన్సిలర్ తాహిర్వలి, మహంతేశ్వర, మేరీ వర కుమారి ,జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సునీల్ కుమార్ తదితరులు సత్యసాయి జిల్లా శాఖ పక్షాన అధికారులను డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు