Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈ నెల 18 న చలో ఖమ్మం జయప్రదం చేయండి ….

ఈ నెల 18 న చలో ఖమ్మం జయప్రదం చేయండి ….

- Advertisement -

సిపిఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం/బత్తలపల్లి; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మం లో నిర్వహిస్తున్నామని ఈ మహాసభకు 5 లక్షల మంది దాకా సిపిఐ కార్యకర్తలు పాల్గొంటారని , కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బత్తలపల్లి మండలo లో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాని జయప్రదం కోరుతూ సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని వారి పిలుపునిచ్చారు. .ఈనెల 17 తారీఖున ధర్మవరం నుంచి ఖమ్మం కు సిపిఐ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిందని , కావున ప్రతి కార్యకర్త చలో ఖమ్మం రావాలని కోరారు. ఈ శతాబ్ద కాలంలో సిపిఐ ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో త్యాగాలు ఎంతో మంది అమరువీరుల రక్త తర్పణంతో ఎన్నెన్నో విజయాలు సాధించి, భారత దేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని భూమి కోసం, భుక్తి కోసం, నిరంకుశ నిజామును గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో మూడు వేల గ్రామాల విముక్తి కలిగిందన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ది మనీ స్పష్టం చేశారు.ఫలితంగానే పాలకులు భూ సంస్కరణ చట్టం గరీబీ హటావో బ్యాంకుల జాతీయ కర్ణ అనే సంస్కరణలు చేయాల్సి వచ్చింది. అని తెలిపారు. పోరాటాల ద్వారా దేశంలోనే అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది అని, కమ్యూనిస్టు పార్టీ యూపీఏ ప్రభుత్వంలో చరిత్రత్మక సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం అటవీ హక్కుల చట్టం తీసుకురావడానికి సిపిఐ కృషి చేసిందనీ పేర్కొన్నారు. కావున చలో ఖమ్మం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కమతం కటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్ళయప్ప, సిపిఐ మండల కార్యదర్శి వెంకటేష్, సహాయ కార్యదర్శి ఓబులేష్, సన్న పెద్దన్న, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ సిపిఐ నాయకులు సత్యప్ప, నాగభూషణ, వెంకటప్ప, లక్ష్మనారాయణ, కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు