Homeజిల్లాలుఅనంతపురంరైతు బజారు ఏర్పాటుకు స్థలం కేటాయించండి

రైతు బజారు ఏర్పాటుకు స్థలం కేటాయించండి

- Advertisement -

-రాప్తాడు మార్కెట్ కార్యదర్శి కె.రూప్ కుమార్

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడులో రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు బజారు నిర్వహణకు 50 సెంట్లు, మార్కెట్ కమిటీ కార్యాలయం ఏర్పాటుకు 15సెంట్ల స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి కె.రూప్ కుమార్, చైర్మన్ వేపకుంట సుధాకర్, వైస్ ఛైర్మన్ గంగలకుంట కిష్ట తహశీల్దార్ బి.విజయకుమారికి విన్నవించారు. ఈసందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు కాపీలను మంగళవారం తహశీల్దారుకు అందజేశారు. మార్కెట్ కార్యదర్శి రూప్ కుమార్ మాట్లాడుతూ రైతు బజారు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మంచి ధరను పొందడం, వినియోగదారులకు తాజా, కాలానుగుణమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటాయన్నారు. రైతు వినియోగదారునికి నేరుగా లావాదేవీలు ఉండడం వల్ల ఇద్దరికీ లాభం చేకూరుతుందన్నారు, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ఆహార భద్రత కూడా పెరుగుతుందన్న్నారు. ఇవి రైతులకు, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడడం వల్ల తద్వారా నాణ్యతను నిర్ధారించవచ్చన్నారు. రైతులు పండించిన తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవచ్చన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. తహశీల్దారు స్పందిస్తూ సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు