Homeవిశ్లేషణఅమెరికాకు చైనా చెక్

అమెరికాకు చైనా చెక్

- Advertisement -

చైనా వెనిజులాకు ముఖ్య మిత్రదేశం. ఆర్థికంగా, రాజకీయంగా స్నేహంగా ఉంటూ సైనిక సహకారం అందిస్తోంది. చమురు కొనుగోలు, భారీ రుణాలు, చమురు నిక్షేపాలపై పెట్టుబడులు పెట్టింది. వెనిజులా ప్రభుత్వానికి రాజకీయ మద్దతునిస్తూ, ఆయుధ సరఫరా చేస్తూ, అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తోంది. వెనిజులా దేశపు సార్వభౌమాధికారాన్ని నాశనం చేసిన అమెరికా చర్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అంతేకాదు అమెరికా పేరుతో వచ్చిన కష్టంలో కూడా వెన్నంటే ఉంది. ట్రంప్, మాక్రాన్ లాగా ఎలాంటి హడావుడి లేకుండా పెద్ద పెద్ద మాటలు చెప్పకుండా, చైనా నిశ్శబ్ధంగా తన పని తాను చేసుకుపోతూ అమెరికాను నిలువరించింది. వెనిజులాలోని చమురు నిక్షేపాల మీద ఆధిపత్యం సాధించి, దక్షిణ అమెరికాలో తన ఉనికిని అడ్డుకోవడానికే అమెరికా చూస్తోందని చైనా స్పష్టంగా అర్థం చేసుకుంది. వెనిజులాపై దాడి అనేది కేవలం ఒక దేశంపై కాదు బహుళ ధ్రువ ప్రపంచ ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేస్తున్న దాడి అని తెలుసుకుంది. అలాగే బ్రిక్స్‌కు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన కాబట్టి, చైనా అమెరికన్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస చర్యలు తీసుకుంది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరించారన్న వార్త తెలిసిన కొన్ని గంటలకే, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అది సరిగ్గా 120 నిమిషాల పాటు కొనసాగింది. ఆ సమావేశంలో ఎటువంటి ప్రకటనలు లేదా దౌత్యపరమైన బెదిరింపులు లేవు. తుఫానుకు ముందు నిశ్శబ్దంలా మాత్రమే ఈ సమావేశం జరిగింది. అక్కడినుంచి చైనా ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా. చైనా వ్యూహకర్తలు దీన్ని “సమగ్ర అసమాన ప్రతిస్పందన” అని పేర్కొన్నారు. అంటే నేరుగా యుద్ధం చేయకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టడం అన్నమాట.
చైనా తీసుకున్న ముఖ్యచర్యలు : జనవరి 4వ తేదీ ఉదయం 9:15 గంటలకు చైనా తన మొదటి అడుగువేసింది. ఎలా అంటే అమెరికా రక్షణ రంగంతో సంబంధాలు కలిగి ఉన్న కార్పొరేషన్లతో పాటు అమెరికన్ డాలర్‌తో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నిశ్శబ్దంగా ప్రకటించింది.
అమెరికన్ టెక్నాలజీకి దూరం : ఇక అదే రోజు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా బోయింగ్, లాక్‌హీట్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ లాంటి సంస్థలన్నిటితో తమ లావాదేవీలన్నీ స్తంభింపజేసింది. ఈ వార్తతో అమెరికా ఒక్కసారి ఉలిక్కిపడింది. అదే రోజు ఉదయం 11:43 నిమిషాలకు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ గ్రిడ్‌ను నియంత్రించే స్టేట్ గ్రిస్ కార్పొరేషన్ ఆఫ్ చైనా, అమెరికన్ ఎలక్ట్రికల్ పరికరాల సరఫరాదారులతో తన అన్ని ఒప్పందాలను సాంకేతికంగా సమీక్షిస్తున్నట్లు ప్రకటించింది. అంటే అమెరికన్ టెక్నాలజీపై ఆధారపడడాన్ని తగ్గించేసిందన్నమాట.
చమురు వినియోగం : ఇక అదే రోజు మధ్యాహ్నం 2:17 నిమిషాలకు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ అయిన చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని సరఫరా మార్గాల వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. దీని ప్రకారం, ఏటా 47 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ శుద్ధి కర్మాగారాలతో చమురు సరఫరా ఒప్పందాలను రద్దు చేసింది. అంటే చైనా అమెరికాకు పంపించే చమురు ఒప్పందాలను రద్దు చేసి, వాటిని భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు మళ్లించింది. దీంతో చమురు ధరలు ఒక్క రోజులోనే భారీగా 23శాతం పెరిగాయి. చైనా కావాలంటే అమెరికా ఎనర్జీ సరఫరాను అడ్డుకోగలదు అనే అంశం ఇక్కడ నిరూపితమయ్యింది. అంటే చైనా ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క తూటాకి పని చెప్పకుండా అమెరికాకు ఒక వ్యూహాత్మక సందేశాన్ని ఇచ్చినట్టు అయ్యింది.
అమెరికా పోర్టుల్ని వినియోగించడం మానేసింది : చైనా షిప్పింగ్ కంపెనీలు అమెరికా పోర్టులకు వెళ్లడం తగ్గించాయి. దీంతో వాల్‌మార్ట్, అమెజాన్ వంటి పెద్దపెద్ద సంస్థల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చైనా కార్గో షిప్‌లు అమెరికన్ ఓడరేవులను ఉపయోగించుకోవడం మానేశాయి. ప్రపంచ షిప్పింగ్ సామర్థ్యంలో దాదాపు 40 శాతం నియంత్రణ కలిగిన చైనా ఓషన్ షిప్పింగ్ కంపెనీ, ఆపరేషనల్ రూట్ ఆప్టిమైజేషన్‌ని అమలుచేసింది. అమెరికా పోర్టులైన లాంగ్‌బీచ్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ , మయామిపై చైనా ఆధారపడడం తగ్గించింది. చైనాలో తయారైన ఉత్పత్తులు అమెరికన్ ఓడరేవులకు దిగుమతి అవుతాయి. అంటే చైనా ఓడరేవులపై ఆధారపడిన వాల్‌మార్ట్, అమెజాన్ వాటి టార్గెట్లను చేరుకోలేకపోయాయి. చైనా నిర్ణయం వలన అమెరికా సరఫరా గొలుసు కొన్ని గంటల్లో పాక్షికంగా కుప్పకూలిపోయాయి.చైనా చేపట్టిన ఈ వ్యూహాత్మకమైన చర్యలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తే అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఒకటి కనిపిస్తుంది. ఒక్కరోజులోనే చైనా అమెరికాను అన్ని వైపుల నుంచి మట్టిగరిపించి కోలుకోలేని దెబ్బతీసింది. దీన్నే కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే అమెరికా గొలుసుకట్టు వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఒక్కచోటనే ఆపేయడం అన్నమాట. వ్యవస్థాగతంగా అమెరికాను ఎటు కదలనివ్వకుండా తాళ్లతో బంధించడంలాంటి ప్రక్రియన్నమాట. ఇది నిజంగా చైనా అమెరికాకు సైలెంట్‌గా ఇచ్చిన షాక్. దీంతో అమెరికా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో వెనిజులా మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వం చైనా కొట్టిన దెబ్బ నుంచి పూర్తిగా కోలుకునేలోపే, చైనా కొత్త చర్యలను ప్రారంభించింది అంటే గ్లోబల్ సౌత్ దేశాలను సమీకరించడం మొదలుపెట్టింది. ఇక జనవరి 4వ తేదీ సాయంత్రం 4:22కి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఒక అద్భుతమైన ఆఫర్‌ని ప్రకటించారు. అమెరికా మద్దతుతో అధికారంలోకి వచ్చిన వెనిజులా ప్రభుత్వాన్ని గుర్తించబోమని చెప్పిన దేశాలకు అంటే బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా, ఇరాన్, టర్కీ, ఇండోనేషియా సహా మరో 23 దేశాలకు చైనా ప్రత్యేక వాణిజ్య సౌకర్యాలు ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్‌ని ప్రకటించిన 24 గంటలలోపే 19 దేశాలు దిగివచ్చాయి. ముందుగా బ్రెజిల్ అంగీకరించగా తర్వాత భారత్, దక్షిణాఫ్రికా, మెక్సికో వచ్చాయి. ఇది బహుళ ధ్రువ ప్రపంచ పనితీరుకు స్పష్టమైన ఉదాహరణ. ఆర్థిక ప్రోత్సాహకాలను ఆయుధంగా ఉపయోగించి చైనా వెంటనే అమెరికా వ్యతిరేక కూటమిని ఏర్పాటుచేసింది. జనవరి 5న బీజింగ్ తన ఆర్థిక ఆయుధాన్ని ఉపయోగించేసరికి పరిస్థితి మరింత కీలకంగా మారింది. వాషింగ్టన్ నియంత్రణలో స్విఫ్ట్ వ్యవస్థను పక్కనపెట్టి అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించేందుకు చైనా యొక్క అంతర్జాతీయ బ్యాంకుల చెల్లింపు వ్యవస్థ (సిఐపిఎస్` చైనా క్రాస్‌బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టం) సామర్థ్యాన్ని పెంచింది. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా వ్యాపారం చేయడానికి చైనా ఒక చౌకైన, వేగవంతమైన ప్రత్యామ్నాయాన్ని ఈ ప్రపంచానికి అందించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా వ్యాపారం చేయాలనుకునే ఏ దేశం ఐనా సంస్థ లేదా బ్యాంకు అయినా ఈ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇది 97శాతం వరకు తక్కువ ఖర్చుతో, వేగవంతంగా పని చేస్తుంది. చైనా ఈ వ్యవస్థను ప్రారంభించిన తొలి 48గంటల్లోనే 89బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 34దేశాల కేంద్ర బ్యాంకులు చైనా వ్యవస్థలో ఖాతాలు తెరిచాయి. దీని ద్వారా అమెరికా ఫైనాన్సింగ్‌కు కీలకమైన రంగంలో డాలర్ పై ఆధారపడడం అనేది చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉందనే విషయాన్నీ స్పష్టం చేస్తోంది. అంటే అమెరికాకు ముఖ్యమైన ఆదాయ వనరులో డాలర్ పాత్ర వేగంగా తగ్గిపోయి డీ-డాలరైజేషన్‌ను సూచిస్తుంది. ఇక సాంకేతిక రంగంలో కూడా చైనా కఠిన నిర్ణయం తీసుకుంది.
అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ప్రపంచంలోని అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో 60శాతం చైనా నియంత్రణలో ఉన్నాయి. మదురో ఘటనకు మద్దతిచ్చిన దేశాలకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ భాగాల తయారీలో కీలకమైన ఈ ఖనిజాల ఎగుమతులను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చైనా సరఫరా వ్యవస్థలపై ఆధారపడిన ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి అమెరికా టెక్ దిగ్గజ సంస్థలన్నీ ఆందోళనలో పడ్డాయి. అవసరమైన భాగాలు లేకపోతే, వారి ఉత్పత్తి వ్యవస్థలు నిలిచిపోయే ప్రమాదం. చైనా వేస్తున్న ప్రతి అడుగు అమెరికా ఆర్థిక శక్తిని దెబ్బతీస్తోంది. అసలు చైనా వెనిజులా కోసం ఏం చేసింది అంటూ శత్రు దేశాలు, మిత్ర దేశాలు అడుగుతున్న ప్రశ్నలకు చైనా ఇలా బదులిచ్చింది. యుద్ధం ప్రకటించకుండానే చైనా ఎలా చర్యలు తీసుకుంటుందో పై వివరణý ద్వారా తెలుస్తుంది. చెప్పి చేయడం అనేది అందరూ చేసే యుద్ధం కానీ చైనా మాత్రం చెప్పకుండా చేస్తూ అమెరికాను చిత్తు చేస్తుండటమే అసలైన యుద్ధం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు