ఆలయ అడహాక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 25వ తేదీన రథసప్తమి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఆడ హక్కు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒకే రోజున ఏడు వాహనములలో స్వామి వారు పట్టణ పురివీధులలో ఊరేగుతారని తెలిపారు. ఇందులో భాగంగా సూర్యప్రభ, శేష, గరుడ, హనుమత్, కల్ప వృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనములలో స్వామి వారు ఊరేగుతారని తెలిపారు. అంతేకాకుండా ప్రతి వాహనానికి ఉభయ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్య అతిథులుగా ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరవునున్నట్లు వారు తెలిపారు. కావున భక్తతురు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని తెలిపారు.
ఈనెల 25న రథసప్తమి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయండి..
- Advertisement -
RELATED ARTICLES


