- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన సమాచార హక్కు అవగాహన కమిటీ వ్యవస్థాపకులు హబీబ్ రహిమాన్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెబ్సైటు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వెబ్సైటు ప్రారంభం కావడం అసోసియేషన్ సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఈ వెబ్సైటు ప్రధానంగా ప్రజలకు, ఆర్.టి.ఐ కార్యకర్తలకు, ప్రజా సమాచార అధికారులకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


