Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

34 మందికి 17.10 రూపాయల చెక్కులను అందజేసిన పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం: పేదలకు ఆరోగ్యం విషయంలో ఏ కష్టం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా స్పందిస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. నియోజకవర్గంలోని పలువురికి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మొత్తం 34మందికి 17.10లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ కొన్ని సార్లు ఎన్టీఆర్ వైద్య సేవలు అందనివారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు ఆదుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేశారన్నారు. వైద్య పరంగా ఎవరికి కష్టం ఉన్నా.. ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీరామ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు