విశాలాంధ్ర – కడియం : డిజి ఎసిబి అతుల్ సింగ్ ఆదేశాల మేరకు, గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు నిర్వహించినట్లు రాజమహేంద్రవరం ఏసీబీ డిఎస్పి ఎం కిషోర్ కుమార్ తెలిపారు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా ఈ లక్ష్మి విధులు నిర్వహిస్తున్నారని, ఆమె వద్ద నుండి సుమారు 79 వేల రూపాయలు, అదేవిధంగా కార్యాలయం లోని ఇతర విభాగాల నుండి 1,03,010 రూపాయలు కలిపి, మొత్తంగా 1,82, 210 రూపాయలు అనధికార సొమ్మును గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నగదుతో పాటుగా నిషేదిత జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయా? అనే అంశంపై తనిఖీ చేస్తున్నామని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా తక్కువ విలువ చూపించి చేసిన రిజిస్ట్రేషన్ల పైన, ఇతర అక్రమ లావాదేవీల పైన కూడా విచారిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే భయపడకుండా పిర్యాదు చెయ్యాలని కోరారు. ఈ దాడులలో ముగ్గురు ఎసిబి సిఐ లు, ఎసిబి ఎస్ఐ విల్సన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.
కడియం సబ్ రిజిస్ట్రారు కార్యాలయంపై ఏసిబి దాడులు
- Advertisement -
RELATED ARTICLES


