విశాలాంధ్ర – కడియం : కడియం మేకల దిబ్బ సెంటర్ కు చెందిన షేక్ అబ్దుల్ కపూర్ ( నాగు ) కుమార్తె షేక్ అబుష ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటుంది. షేక్ అబ్దుల్ కపూర్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ విషయాన్ని స్థానిక వైయస్ఆర్సీపీ నాయకుల ద్వారా తెలుసుకొని స్వయంగా కడియం వెళ్లి షేక్ అబ్దుల్ కపూర్ ( నాగు ) కుమార్తె షేక్ అబుష ని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పరామర్శించారు. షేక్ అబ్దుల్ కపూర్ కుటుంబానికి 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చందన నాగేశ్వర్ అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు సర్కార్ బాషా, పున్నమరాజు వీర్రాజు, కొసూరి సూరిబాబు, లావేటి రమేష్, ఉప్పులూరి తాతాజీ, చిలుకూరు రామకృష్ణ, బండారు శ్రీనివాస్, పూడి వీరబ్రహ్మం, వనుం పుత్రయ్య, కవల రవి, కడలి సాయి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందించిన చందన నాగేశ్వర్
- Advertisement -
RELATED ARTICLES


