Homeజిల్లాలుశ్రీ సత్యసాయికోవిడ్ అమరవీరులకు ఘనంగా నివాళులు

కోవిడ్ అమరవీరులకు ఘనంగా నివాళులు

- Advertisement -

ఇండియన్ మెడికల్ అసోసియేషన్- సంకారపు నరసింహులు

విశాలాంధ్ర ధర్మవరం: భారతదేశంలో కోవిడ్ అనే వ్యాధి దేశ ప్రజలను దిగ్భ్రాంతులను చేసే సమయంలో, వైద్యులుగా వారి ప్రాణాలను అడ్డుపెట్టి ఎంతోమంది ప్రజలను దేశంలోని వైద్యులు కాపాడి తమ ప్రాణాలను అర్పించడం జరిగిందని, అందుకే వారికి ధర్మవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు సంకారపు నరసింహులు తెలిపారు. వారు మాట్లాడుతూ తమ వృత్తిని పణంగా పెట్టి ప్రాణాలు కోల్పోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. అప్పట్లో అకుంఠిత దీక్షతో కోవిడ్ మహమ్మారిని రూపుమాపుటలో వైద్యుల పాత్ర ఎంతో కీలకంగా దేశంలో మారిందని తెలిపారు. మృతి చెందిన వైద్యులందరినీ సంస్కరించుకుంటూ వారి జీవిత త్యాగాలను గుర్తించుకుంటూ వారికి ఘన నివాళులు వైద్యులందరూ అర్పించడం జరిగిందన్నారు. వీరి వారసత్వాన్ని మా గుండెల్లో నింపుకొని ముందుకు సాగుతామని వారు పునరాద్ఘాటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు