Homeజిల్లాలుతూర్పు గోదావరిరెండో రోజు కొనసాగుతున్న ఏసిబి సోదాలు

రెండో రోజు కొనసాగుతున్న ఏసిబి సోదాలు

- Advertisement -


–భారీగా బయటపడుతున్న అవకతవకలు

విశాలాంధ్ర – కడియం : కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ ఈ లక్ష్మి కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె పై పలు పత్రికల్లో రక రకాల ఆరోపణలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పి కిషోర్ కుమార్, ఆయన సిబ్బందితో కలిసి రెండవ రోజైన శుక్రవారం కూడా సొదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్, డిఐజి, జిల్లా ఆడిటర్ సమక్షంలో రికార్డులను పరిశీలించామని తెలిపారు. (అండర్ వాల్యూ రిజిస్ట్రేషన్) ఆస్తి యొక్క విలువ ధర కంటే తక్కువ ధర చూపించి పది డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం కారణంగా ప్రభుత్వానికి సుమారుగా రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు నష్టం వాటిలినట్టు గుర్తించామన్నారు. గతంలో కూడా తక్కువ ధర చూపించి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా సుమారు 95 లక్షల 45 వేల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు గుర్తించడం జరిగిందన్నారు. అలాగే 2025 సంవత్సరంలో సరైన డాక్యుమెంటు ఆధారాలు లేకుండా 911 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కూడా గుర్తించామని తెలిపారు. అదేవిధంగా( ఈ నెల 28, 29) బుధ, గురు వారాలలో 144 రిజిస్ట్రేషన్లు జరగగా, వాటిలో 107 రిజిస్ట్రేషన్ లకు సంబంధించిన డాక్యుమెంట్లు డెలివరీ చేయలేదని తెలిపారు. సమగ్రంగా సోదాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు