Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

- Advertisement -

ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి: సిఐటియు


విశాలాంధ్ర ధర్మవరం: గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలని, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్హెచ్ భాష సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి మాట్లాడుతూ తొలుత ధర్మవరం మండలం గొట్లూరు, గ్రామంలో సిఐటియు, సిపిఎం, ఆధ్వర్యంలో, జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధి కార్మికులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ 2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం జరిగింది అని తెలిపారు.ఈ పథకంలో, అత్యధిక మంది కూలీలు, పేద రైతులు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల పేదలు, వెనుకబడిన కులాల వారు అగ్రకులాలకు చెందిన పేదలకు, ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని, ఈ పథకంలో మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలవుతుందన్నారు,
ఇలాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా చట్టాలు చేయడాన్ని సిపిఎం పార్టీ, సిఐటియు,తీవ్రంగా ఖండిస్తున్నాయని కార్పొరేట్ల ఒత్తిడితోనే, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అధిక భారం పడుతుందని పాత చట్టం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించే వారు కొత్త చట్టం వల్ల రాష్ట్రాలు 40 శాతం కేంద్రం 60 శాతం నిధులు భరించవలసి వస్తుందని అందువలన ఈ కొత్త చట్టాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు నాయకులు ఎల్, ఆదినారాయణ, జంగమన్న,ఉపాధి కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు