–టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) అంబటి రాంబాబు మతిబ్రమించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు . ఆదివారం పెద్దకడబూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా, బాధ్యతారహిత్యంగా అంబటి రాంబాబు మాట్లాడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేతల తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.ఇటువంటి వాటిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.


