Homeఆంధ్రప్రదేశ్ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి

- Advertisement -

ప్లకార్డులు చేతపట్టి పార్లమెంటు వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు

కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని… అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల నివాసాలపై దాడుల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి పరిస్థితిని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి పరిస్థితులను ఆయనకు వివరించాలని వైసీపీ భావిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు