విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : బొమ్మి నాయుడు వలస పంచాయితీ పరిధిలోని గొల్లపేట నుంచి బొమ్మి నాయుడు వలస తారు రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణ స్థితిలో ఉండటాన్ని గుర్తించిన
మాజీ సర్పంచ్ మంగం రమేష్ ప్రజల ఇబ్బందులను తట్టుకోలేక స్వంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.సోమవారం ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మరమ్మత్తుల వలన
ద్విచక్ర వాహనదారులు పాదచారులు, గ్రామ ప్రజలు ఎంతో ఊరట పొందారు. “అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటా” – మంగం రమేష్ ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంగం రమేష్ మాట్లాడుతూ,
పంచాయతీలోని అన్ని గ్రామాలకు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని,
అవస్థాపన సౌకర్యాల కల్పనలో తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు.
ప్రజల ఇబ్బందులు తట్టుకోలేక… స్వంత నిధులతో రోడ్డు మరమ్మతులు
- Advertisement -


