రోటరీ క్లబ్ ప్రతినిధులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ కోశాధికారి నరేందర్ రెడ్డి కార్యదర్శి విజయభాస్కర్ క్యాంపు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సేవలు చేస్తూ ఉచిత వైద్య చికిత్సలతో పాటు, ఉచిత వసతి, ఉచిత ఆపరేషన్లు, ఉచితంగా అద్దాలను పంపిణీ చేస్తామని తెలిపారు. పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలోనే రోటరీ క్లబ్ విశేష కృషి చేస్తుందని తెలిపారు. షుగరు, బిపి ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకుని తగ్గించుకున్న తర్వాత రావాలని తెలిపారు. తదుపరి సాంస్కృతిక మండలిలో కరపత్రాలని విడుదల చేశారు.కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, సత్రశాల ప్రసన్న కుమార్, శ్రీనివాసులు, సోలిగాల వెంకటేశులు పాల్గొన్నారు.
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


