మండపేట : విద్యుత్ శాఖా మంత్రి మండపేట పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కోరారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పలు చోట్ల సబ్ స్టేషన్ లు ప్రారంభించటానికి ఈ నెల 5 గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండపేట విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ళ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పట్టణంలో వాటర్ వర్క్స్ వద్ద 11 కె.వి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టేకి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవతం చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ళ కోరారు.
ఫిబ్రవరి 5 న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి మండపేట పర్యటన
- Advertisement -
RELATED ARTICLES


