Homeజిల్లాలుఅనంతపురంకాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన..

కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన..

- Advertisement -

విశాలాంధ్ర–తాడిపత్రి: పట్టణంలోని టైలర్స్ కాలనీ పరిధిలోని 21, 23, 24వ వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక అవసరాలపై వివరాలు సేకరించారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ పెండింగ్ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు . ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలు ఆలస్యం కాకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు టాటా హజి, మైనార్టీ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు