Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు..

అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు..

- Advertisement -

విశాలాంధ్ర, గోరంట్ల: బూదిలి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామ రైతులు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన డీఎస్పీ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు, స్థానికంగా కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహించి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇది భూగర్భ జలాల స్థాయిపై, వ్యవసాయ భూములపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ స్పందిస్తూ, సంబంధిత ప్రాంతంలో ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా పర్యవేక్షణ పెంచాలని సర్కిల్ ఇన్స్పెక్టర్‌ గారిని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. “రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు చేపడతమన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బాలస్వామి, సిపిఐ గోరంట్ల మండల నాయకులు నార్శింపల్లి కిష్ట, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రైతు ప్రతినిధులలో నాగమల్లప్ప, జి. మల్లికార్జున, మంజునాథ్, జి. శ్రీనివాసులు, పిసి మంజునాథ్, జియావుల్లా, రమేష్ అప్ప, గంధం జయరాం, జి. ఆదిమూర్తి, పి. ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రామాంజినప్ప, సీనప్ప తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు