– జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం: తిరుమల లడ్డు కల్తీ చేయలేదని వైసీపీ వాళ్లు చెప్పడం సిగ్గుచేటని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ కార్యాలయం లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల వైసీపీ వాళ్ళు తిరుమల లడ్డులో కల్తి నెయ్యి చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కల్తీ చేయకపోతే వాళ్లు అలిపిరి మెట్ల దగ్గర ప్రమాణం చేసేకి సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. అదేవిధంగా కల్తీ చేశారని ప్రమాణం చేసేకి మేము సిద్ధంగా ఉన్నామని మీరు చేసిన కల్తి నెయ్యి దోపిడీని బట్టబయలు చేశామని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. తిరుమల కల్తీ లడ్డు వాస్తవం అని ఇప్పటికైనా ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు హితవు పలికారు. అదేవిధంగా తిరుమల దేవస్థానంలో గత ప్రభుత్వ హయంలో శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యకు బదులు రసాయానాలతో కూడిన సింథటిక్ పదార్దాలు కలిపి నెయ్యి తో కల్తీ లడ్డూలను తయారు చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వారి మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి భక్తులను, హిందువులను హిందూ సాంప్రదాయాలను, తిరుమల లడ్డును వైసీపీ వాళ్ళు అపవిత్రం చేశారని, ఇటీవల సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో ఒక్క చుక్క ఆవు పాలు లేకుండా, వినియోగించారని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నప్పటికీ, వైసీపీ శ్రేణులు దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మండిపడ్డారు.తిరుమల లడ్డు ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తీవ్రవనీతి, అధర్మ చర్యలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని శాఖల మంత్రిగా ఉన్న సభ్యుల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కల్తీ సహజమే అని చెబుతున్నారు అంటే వీళ్ళకి ప్రజల మీద చట్టం మీద, ధర్మం మీద కనీస గౌరవం బాధ్యతలు అస్సలు లేవని స్పష్టమైంది అన్నారు.అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత అంశాలను పార్టీకి రుద్దడం సరికాదని అది ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఆయన్ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పార్టీ అధిష్టానం తెలియజేసిందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని త్రిసభ్య కమిటీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తిరుమల లడ్డు కల్తీ చేయలేదని వైసీపీ వాళ్లు చెప్పడం సిగ్గుచేటు
- Advertisement -
RELATED ARTICLES


