Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాయలసీమకు జగన్ చేసింది శూన్యం

రాయలసీమకు జగన్ చేసింది శూన్యం

- Advertisement -

పోతిరెడ్డిపాడుకు పోయి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా..?

ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

విశాలాంధ్ర-కదిరి:పోతిరెడ్డిపాడుకు పోయి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా అని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు గురువారం స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు వైఎస్ఆర్ జగన్ చేసింది శూన్యమన్నారు.నాడు కృష్ణా నదిలో మిగులు జలాలు కోరబోమని జగన్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోశారని,అప్పర్ భద్ర నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదని,నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే జగన్ నిర్లక్ష్యపు దోరణే కారణమన్నారు.
ఐదేళ్ల పాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి రద్దు చేసి సీమన ఎడారి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో సీమకు రూ.2 వేల కోట్లే ఖర్చు చేస్తే,2014-19 లో చంద్రబాబు ప్రభుత్వం రూ.12,011 కోట్లు, ఈ 19 నెలల్లో రూ.8 వేల కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తోందని అన్నారు.జగన్ ఇసుక దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రతి సంవత్సరం గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న సుమారు 3000 టీఎంసీల నీటి నుండి 200 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా రాయలసీమ శాశ్వత అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాయలసీమ భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా, రాయలసీమను రతనాల సీమగా చేయడమే చంద్రబాబు గారి లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ సి సెల్ నాయకులు రాజ శేఖర్ బాబు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు