- Advertisement -
విశాలాంధ్ర- అనంతపురం టౌన్: అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ గా పీవీ లలిత నియమితులయ్యారు. కడప రిమ్స్ లో పని చేస్తూ ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్.ఎం.ఓ డాక్టర్ గుజ్జల హేమలతను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించారు. ఆమెకు వారు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ లలితకు స్టాఫ్ నర్సులు శాలువ, పూలమాలలతో సత్కరించారు.


