Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅండర్ బ్రిడ్జ్ వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాట్లు

అండర్ బ్రిడ్జ్ వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాట్లు

- Advertisement -

హర్షం వ్యక్తం చేసిన ప్రయాణికులు


విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని కొత్తపేట అండర్ బ్రిడ్జ్, పోతుకుంట వద్ద గల అండర్ బ్రిడ్జ్ లలో రాత్రిపూట విద్యుత్ దీపాలు లేకపోవడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులకు, ఆ వార్డు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా 30 ఆరవ వార్డు ఇన్చార్జ్ జనసేన నాయకుడు కోటిరెడ్డి రాజారెడ్డి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక కమిషనర్ తో చర్చలు జరిపి, ఎట్టకేలకు పోతుకుంట బ్రిడ్జ్, కొత్తపేట బ్రిడ్జి వద్ద మొత్తం 12 విద్యుత్ దీపాలను మున్సిపల్ సిబ్బంది ద్వారా అమర్చారు. అదేవిధంగా కొత్తపేట బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా నాలుగు విద్యుత్ ఫోన్ను కూడా బిగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా వార్డు ప్రజలతో పాటు వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పామిశెట్టి కళ్యాణి, పెద్దకోట్ల రవి, ప్రతాప్, అంజి, భైరవ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు