– ఎస్టీ కమిషన్ సభ్యులని కలిసిన సాకే పురుషోత్తం
విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ ఎస్ టి కమిషన్ నెంబర్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం తెలిపారు. ఆదివారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అనంతపురం కు రావడంతో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఎస్టి గురుకుల లో మౌలిక వసతులు గిరిజన, ఎరుకుల వాడల్లో తాగునీటి వసతులు, విద్యుత్తు, ఆరోగ్య, పారిశుద్ధ్యం, విద్య, ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలు తదితర అనేక సమస్యలను జాతీయ ఎస్టి కమిషన్ నెంబర్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన కూడా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు.


