Homeసాహిత్యంఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్

ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్

- Advertisement -

సాంఘికం, చారిత్రకం, జానపదం, సైన్స్ ఫిక్షన్ సంబంధిత అంశాలతో కథలరూపంలో, నవలలరూపంలో రచనలు చేస్తుంటారు. అయితే వీటిలో చారిత్రకం, జానపదం, సైన్స్‌ఫిక్షన్ నవలలుకాని, కథలుకాని రావడం ఎప్ప్పుడో తప్ప అరుదుగానే వస్తుంటాయి. అయితే అప్ప్పుడప్ప్పుడు వచ్చినా ఆ రచనలు పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే రీతిలో సాగుతాయి. అటువంటి రచనే సైన్స్ ఫిక్షన్ నవలల పోటీ 2024లో బహుమతి పొందిన ప్రముఖ రచయిత సలీంగారు అందించిన ‘చంద్రునికో నూలుపోగు’ నవల. ప్రారంభం నుంచి ఆద్యంతం వరకు చదువరులను ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ కథల్ని ఇష్టపడే పిల్లలను సైతం ఉత్కంఠభరితంగా చదివిస్తుంది.
ఇందలి కథాంశమే కొత్తగా ఉంటుంది. భూగ్రహవాసులకు అత్యంత ఇష్టమైన చంద్రుని విశ్వాంతరాళంలో భూమికి సుదూరంగా ఉన్న ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు గ్రహాలు నిక్స్, నిఫిలిక్స్..నిక్స్ గ్రహానికున్న రెండు చంద్రుళ్లు ప్రతిరోజూ చల్లని నిండైన వెన్నెలతో అమావాస్య ఎలా ఉంటుందో కూడా అక్కడి వారికి తెలియని మనోహరమైన రాత్రుల్ని అందిస్తుంటాయి. అయితే నిఫిలిక్స్ గ్రహానికి ఒక్క చంద్రుడు కూడా లేడు. అందుకే అక్కడివారు చంద్రుని వెన్నెలను ఆస్వాదించాలను కుంటారు. దాని పాలకునితో సహా. అందుకే నిఫిలిక్స్ తోటిగ్రహమైన నిక్స్ నుంచి ఓ చంద్రుని అడిగితే ప్రజలతో సహా అందరూ ఆ గ్రహానికిచ్చేందుకు నిరాకరించడంతో నిఫిలిక్స్ గ్రహం యుద్ధానికి సిద్ధమవుతుంది.
నిక్స్ గ్రహానికి ఉన్న ఆధునిక ఆయుధాల ధాటికి ఓటమి అంచుకు చేరుకుని ఆపై యుద్ధాన్ని విరమించు కుంటుంది. అయితే ఎలాగైనా చంద్రుని సంపాదించాలని అనేకచోట్ల గాలించి చివరకు భూమికి వెన్నెలను అందించే చంద్రుని తమ గ్రహానికి తీసుకుపోవాలని భావించి అందుకనుగుణంగా అత్యంత శక్తిమంతమైన వ్యవస్థ కలిగి ఆస్టరాయిడ్‌ని పోలిన ఉపకరణాన్ని తయారుచేస్తారు.
భూమిమీద ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్యమిహిర తన పరిశోధనల్లో భాగంగా భూమిమీదకి ఆస్టరాయిడ్ లాంటిది వస్తోందని పరిశీలించి అందర్ని అప్రమత్తం చేస్తాడు. అనేక పరిశోధనల మీదట అది చంద్రునికోసమని గ్రహించి దాన్ని విచ్ఛిన్నం చేయకపోతే భూమికి ప్రమాదమని భావించి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నలుగురు శాస్త్రవేత్తల్ని ఎంపిక చేసి స్పేస్‌షిప్‌లో అంతరిక్షంలోకి పంపుతారు. దాన్ని నిఫిలిక్స్ గ్రహం తన సాంకేతిక పరిజ్ఞానంతో ధ్వంసం చేయడంతో అనుకోకుండా వారు మరోగ్రహాన్ని చేరడం అక్కడివారు వీరిని uంధించడం ఆ తర్వాత నిక్స్ గ్రహం అధిపతి సిసిరస్ ద్వారా వారెందుకు వచ్చారో వాస్తవం గ్రహించి విడుదల చేస్తాడు. ఆ తర్వాత సిసిరస్ తమ సాంకేతిక పరిజ్ఞానం టెలీపోర్టేషన్ ప్రక్రియ ద్వారా శాస్త్రవేత్తల్ని అక్కడికి పంపుతాడు. ఆ తర్వాత వారు చంద్రుని కోసం వస్తున్న ఆస్టరాయిడ్ లాంటి బిగ్‌మాస్‌ను ధ్వంసంచేసి తమ చంద్రుని కాపాడుకోవాలి. ఆ ప్రయత్నంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారా? అనేది ఈ నవల చదివి తెలుసుకుంటే ఆసక్తిగా ఉంటుంది.
పిల్లల్ని, పెద్దల్ని సైతం అలరించే చక్కని సైన్స్ ఫిక్షన్ నవల చంద్రునికో నూలుపోగు. బహుమతి పొందిన ఈ నవలను పాఠకులకు అందించిన ప్రచురణకర్తలు అభినందనీయులు.
`కౌశిక

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు