Homeక్రీడలుఅబ్బే… నేను అలా అనలేదు

అబ్బే… నేను అలా అనలేదు

- Advertisement -


నఖ్వీ పై మాట మార్చిన పాక్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్


క్రీడలు : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్ 24 గంటల్లోనే మాట మార్చాడు. తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీ సీ బీ) అధ్యక్షుడు నఖ్వీ ని అసమర్ధుడు, నిరక్షరాశుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అసమర్థుడు నిరక్షరాస్యుడు అనే పదాలను తాను వేరే అర్ధంలో పాకిస్తాన్ క్రికెట్ ను దృష్టిలో పెట్టుకొని అన్నానని అంతేకానీ… మొహ్సిన్ నఖ్వీ ని ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నడుపుతున్న అగ్రశ్రేణిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానన్నాడు. కానీ నా మాటలను ఆ టెలివిజన్ ఛానల్ వక్రీకరించిందన్నారు. నిజానికి ఆ కార్యక్రమంలో నేను నకిలీ గురించి తప్పుగా మాట్లాడకూడదని కూడా చెప్పాను. అతడు మంచి వ్యక్తి పాకిస్తాన్ క్రికెట్ కి సాయం చేయాలనుకుంటున్నాడు కానీ అతడికి సరైన సలహాలు ఇచ్చేవారు లేరు అని సోయబ్ అక్తర్ వివరణ ఇచ్చాడు. సోయం అత్తర్ అంతకుముందు భారతీయ ఛానల్ తో మాట్లాడుతూ… నఖ్వీ అసమర్థుడని పాక్ క్రికెట్ ను నడపలేడన్నాడు. ” మీరు నన్ను ఛానల్ చైర్మన్ చేస్తే… నాకు దీన్ని నడపడం ఎలాగో తెలుస్తుందా? అలాగే ఏమీ తెలియని వ్యక్తి ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నాడు. ప్రపంచంలోకెల్లా పెద్ద నేరం ఏంటంటే అసమర్థుడైన నిరక్షరాస్యుడైన వ్యక్తిని అందలం ఎక్కించడం ” అని అతడు అన్నాడు. టి -20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్ పాక్ జట్లు ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ పాక్ పై అరవై యొక్క పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు