Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయంయూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌.. వెళ్లిపోతూ యూనస్ సంచలన వ్యాఖ్యలు

యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌.. వెళ్లిపోతూ యూనస్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే, అందులో ఆయన మరోసారి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్‌ సిస్టర్స్‌ (Sవఙవఅ Sఱstవతీs)్ణను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్లగక్కారు.

‘తన ప్రసంగంలో యూనస్ ఁబంగ్లాదేశ్ ఇకపై విధేయతతో కూడిన విదేశాంగ విధానాన్ని అనుసరించే దేశం కాదు. ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడదుఁ అని స్పష్టం చేశారు. తమ 18 నెలల పాలనలో దేశ ఁసార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలు, గౌరవాన్నిఁ తిరిగి నిలబెట్టామని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా, ‘ఏడు సోదరి రాష్ట్రాలు్ణ (భారత్ లోనివి), నేపాల్, భూటాన్‌లకు తమ దేశ సముద్ర మార్గం గొప్ప అవకాశమని యూనస్ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2024 ఆగస్టులో అధికారంలోకి వచ్చిన యూనస్ ప్రభుత్వం, ఇటీవలి ఎన్నికల అనంతరం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి అధికార పగ్గాలు అప్పగించనుంది. గడిచిన కొంతకాలంగా భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు కొంత ఒడిదుడుకులకు లోనైన నేపథ్యంలో యూనస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్‌పీ మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. బీఎన్‌పీ నేత తారిఖ్‌ రెహ్మాన్‌ నూతన ప్రధానిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2024లో విద్యార్థుల ఆందోళనలతో మాజీ ప్రధాని షేక్‌ హసీనా గద్దె దిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్‌ సారథ్యం వహించారు. 18 నెలల పాటు ఆయన నేతృత్వంలో పాలన సాగింది. ఈ క్రమంలోనే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. సోమవారం తన బాధ్యతల నుంచి వైదొలుగుతూ.. బంగ్లాదేశ్‌ ఏమాత్రం లొంగిపోయే దేశం కాదని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల సలహాలు, సూచనలతో తమ ప్రభుత్వం పనిచేయబోదని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు