Homeసినిమాఅందుకే స్టంట్స్‌ చేయలేదు: ప్రియాంక చోప్రా

అందుకే స్టంట్స్‌ చేయలేదు: ప్రియాంక చోప్రా

- Advertisement -


ది బ్లఫ్‌..సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు

సినిమా: భారతీయ సినిమాలతో పాటు హాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ అలరిస్తున్నారు నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ‘వారణాసి్ణతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆమె నటించిన ‘ది బ్లఫ్‌ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వారణాసి గురించి మాట్లాడారు. ‘ఇండియాలోనే బెస్ట్‌ డైరెక్టర్‌లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్‌కు అర్థం చెప్పే సినిమా అవుతుంది. దీని విడుదల కోసం అభిమానులతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను్ణ్ణ అని తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మందాకినీ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కిచ్చా సుదీప్‌ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక… ఇదే ఇంటర్వ్యూలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది బ్లఫ్‌్ణ గురించి ప్రియాంక మాట్లాడారు. ఫ్రాంక్‌ ఇ.ఫ్లవర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో్ణలో ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ఈ సినిమాలో స్టంట్స్‌ గురించి ప్రస్తావించారు. ‘‘ఇందులో నాలుగు ప్రమాదకరమైన స్టంట్స్ ఉన్నాయి. ముఖంపై గాజుపెంక్కులు గుజ్జుకునేలా చేయాలి. అవి రిస్క్‌ అని తెలిసి డూప్‌తో చేయించారు. దర్శకుడు కూడా నన్ను ఆ షాట్స్‌ చేయనివ్వలేదు. నేను కూడా ఆసక్తి చూపలేదు. నటన నా ఉద్యోగం. నాకు ఇచ్చిన దానికి వందశాతం న్యాయం చేస్తే చాలనుకున్నాను. నాతోపాటు ఎవరూ గాయపడకూడదని అనుకున్నా్ణ్ణ అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు